నేడు తిరుపతిలో ముగ్గురు ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 19 వ తేదీ వరకు టెంపుల్ ఎక్స్ పో 2025 జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌..ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తారు. ఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో‌ను మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్‌గా తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. 

సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంత్యోదయ ప్రతిష్ట సంస్థ కృషి చేస్తోందని.. ఇందులో భాగంగా 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ మూడు రోజులు జరిగే సదస్సుకు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. 111 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో 60 కి పైగా స్టాల్స్‌, 15 వర్క్‌ షాప్‌ లను ఏర్పాటు చేశామన్నారు.

ఆలయాల నిర్వహణ, వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థలను నెలకొల్పటం, డిజిటలైజేషన్‌ ఆధారిత వ్యవస్థలను పెంపొందించడంపై ఈ సదస్సు ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. దేశ అభివద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్తుభారత్‌ 2047 లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos