కాకినాడ జిల్లా తునిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ,టీడీపీ సై అంటే సై అంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక వాయిదా పడగా, ఇవాళ నాలుగోసారి ఎన్నికకు సిద్ధమయ్యారు అధికారులు. ఎన్నిక నేపథ్యంలో అక్కడికి చేరుకున్న వైకాపా కౌన్సిలర్లను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వారు వెనుదిరిగి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంటికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అయితే వైసీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కిడ్నాప్‌ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదని.. వైసీపీ కౌన్సిలర్లలో ఎక్కువ మంది తమకే మద్దతిస్తారని చెబుతున్నారు.

ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మరోవైపు వైసీపీ నేత దాడిశెట్టి రాజా 'చలో తుని'కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని హెచ్చరించారు. తుని మున్సిపాలిటీ పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి

ఈ క్రమంలోనే దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో.. స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపారు పోలీసులు. అనుచరులతో కారులో తుని వెళ్తున్న వైకాపా నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అలానే జక్కంపూడి గణేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. తుని బయల్దేరేందుకు సిద్ధమైన ఆయన్ని రాజమండ్రిలోనే అడ్డుకున్నారు. లాఠీఛార్జ్‌లు, తోపులాటలతో పరిస్థితి గందరగోళంగా మారింది. తుని మున్సిపల్‌ కార్యాలయం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. మొత్తానికి ఇవాళ తుని పట్టణమంతా  ఉద్రిక్త పరిస్థితుల మధ్య అట్టుడుకుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos