కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి పైనా, ప్రధాని మోదీపైనా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని, ఇండియా నిఘా వ్యవస్థలను మోదీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా మోదీ కోసం పని చేస్తున్నదని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పని చేస్తున్నదని విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు బాధ్యులు మోదీ,అమిత్ షా అన్నారు. వీళ్లిద్దరూ తక్షణం రాజీనామా చేయాలన్నారు.

పహల్గాంలో జరిగింది మనం దేశం మీద జరిగిన దాడి అని షర్మిల అన్నారు. దేశంలో శాంతిభద్రతలు గొప్పగా ఉన్నాయని మోదీ ఒక క్యాంపెయిన్ నడిపారని, పెదపెద్ద బోర్డులు పెట్టారని షర్మిల తెలిపారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారని... ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని అన్నారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనే లేరన్నారు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు లేనే లేరని షర్మిల తెలిపారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారంటే ప్రభుత్వ లోపమే ఇందుకు కారణమని అన్నారు. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వ పై ఉందన్నారు. మోదీ చౌకిదార్ అని చెప్పుకుంటున్నారని, ఇదేనా చౌకిదార్ తనం అని నిలదీశారు. ఈ ఘటనకు అమిత్ షా, మోడీ బాధ్యత వహించాలన్నారు. దీనికి బాధ్యతగా వీళ్లిద్దరూ రాజీనామాలు చేయాలని, ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని షర్మిల విమర్శించారు.

ఇవ్వాళ దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పని చేయడం లేదని, ఇండియా ఇంటలిజెన్స్ ను బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద వాడుతున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద వాడుతున్నారన్నారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని అన్నారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీ కి చౌకీదార్లు అని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. నిఘా వ్యవస్థ బలం అంతా మోడీ కోసం పని చేస్తున్నదని, దేశ భద్రతను గాలికొదిలేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని, దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని,ఈ దేశంలోనే ఇంటర్నల్ గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానమనే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos