ఏపీలో తాజాగా సీఎం చంద్రబాబుకూ, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కూ మధ్య జరిగిన ఓ సంభాషణకు సంబంధించిన ఆడియో కాల్ వైరల్ అవుతోంది. ఇందులో టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యం మేరకు చేయించని సుభాష్ ను చంద్రబాబు సీరియస్ గా తిట్టినట్లుగా ఉంది. దీంతో ఈ ఆడియో కాల్ ను వైసీపీ వర్గాలు నిన్న బాగా వైరల్ చేశాయి. దీనిపై ఇవాళ మంత్రి సుభాష్ స్పందించారు.

నిన్నంతా తన అధినాయకుడు చంద్రబాబు మందలించిన ఆడియో విపరీతంగా ట్రోల్ చేశారని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. అదే తాను ప్రైవేట్ గా ప్రమోట్ చేయించకుంటే ఎంతో ఖర్చు అయ్యేదని, కానీ వైసీపీ, సాక్షి ఆ పని ఫ్రీగా చేసి పెట్టాయన్నారు. తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటింగ్ 26 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందన్నారు. వార్డు మెంబర్ కూడా కానీ తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చి శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని గర్వపడేలా చేసారన్నారు.

తన అలసత్వం వల్ల, తప్పు ఉండటం వల్ల సీఎం చంద్రబాబు తండ్రిలా ఒక్క మాట అంటే తాము స్పందించి తప్పు సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ వేరే కోణంలో చూడబోమన్నారు. ఓ టీచర్ విద్యార్దిని మందలించినా, కొట్టినా వారి శ్రేయస్సు కోసమేనన్నారు. ఇది కూడా అలాంటిదేనన్నారు. చంద్రబాబు పార్టీ విషయాల్లో ఎంత క్లియర్ గా ఉంటారో, వ్యక్తిగత అంశాల్లోనూ కింది స్ధాయి నాయకుల్ని చాలా కీన్ గా చూస్తారన్నారు. తాము కార్యకర్తల్ని పట్టించుకుంటున్నామో లేదో చూస్తారన్నారు. తన కోసం ఎన్నికల్లో కష్టపడిన వారిని చంద్రబాబు మర్చిపోరన్నారు.

కానీ జగన్ మాత్రం తనకోసం కష్టపడిన చెల్లి, తల్లిని బయటికి గెంటేశారని... . తప్పును గుర్తించి చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రత్యర్ధుల ఏడుపులే తనకు దీవెనలు అవుతున్నాయన్నాయని... ఇప్పుడు తమ ఓటింగ్ శాతం 26 నుంచి 41కి పెంచారని... వారి మేలు మర్చిపోలేనన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos