వల్లభనేని వంశీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కుట్ర చేశారని.. వారి సామాజికవర్గం నుంచి వల్లభనేని వంశీ రాజకీయంగా ఎదురుగుతున్నారని కుట్ర చేసి జైల్లో పెట్టారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో ఫిర్యాదుదారు అయిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్ డ్రా చేసుకునేలా చేశారన్న కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న వంశీని జగన్ పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి పట్టాబి వల్ల జరిగందన్నారు. పట్టాభి వైసీపీ ఆఫీసుపైకి దాడి చేయడానికి మనుషులతో బయలుదేరారని, పట్టాభి రెచ్చగొట్టడం వల్లనే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని .. వంశీని ఆయనే రెచ్చగొట్టారని జగన్ అన్నారు. ఆ దాడి కేసులో కేసు కావాలనే సత్యవర్ధన్ తో పెట్టించారని ఆరోపించారు. గన్నవరంలో దాడి జరిగింది కిడయాల సీతారామయ్య అనే వ్యక్తి బిల్డింగ్ పైన అన్నారు. అయితే అందులో టీడీపీ ఆఫీసు ఉంది. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ఈ కేసు పెట్టారు. అయినా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కేసు ఆయనతో పెట్టించారని.. కడియాల సీతారామయ్య  ఎస్సీ, ఎస్టీ కాదు కదా కనీసం బీసీ కూడా కాదని జగన్ అన్నారు. 

పోలీసులు పెట్టిన కేసులో  వల్లభనేని వంశీ పేరే లేదని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కేసును రీఓపెన్ చేశారని, వంశీకి బెయిల్ రాకూడదని.. నెలల తరబడి జైల్లో ఉంచేలా కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జగన్ ఆరోపించారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వారు టోపీ మీదున్న మూడు సింహాలకు సెల్యూట్ చేయాలన్నారు. చంద్రబాబుకు సెల్యూట్ చేయవద్దని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలి పెట్టబోమన్నారు. తప్పు చేసిన వారు సప్త సముద్రాల అవతల ఉన్నా .. రిటైర్ అయినా..  బట్టలూడదీసి నిలబెడతామని జగన్ హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఇంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్ కు వ్యతిరేకంగా ఆయన చేసిన కౌంటర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos