తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ ఐఏఎస్‌ల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 16వ తేదీలోపు అంటే ఈ రోజు లోపు ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు ఇవ్వగా.. ఈరోజే గడువు ముగుస్తుండటంతో ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని.. అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్‌)ను ఆశ్రయించగా.. అక్కడ వారికి చుక్కెదురైంది. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనంటూ క్యాట్ స్పష్టం చేసింది. దీంతో.. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ ఐఏఎస్‌లు ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి కాటా, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన.. ఈ పిటిషన్ దాఖలు చేశారు.

క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణలోనే తమను కొనసాగించేలా తీర్పునివ్వాలని హైకోర్టును ఐఏఎస్‌లు అభ్యర్ధించారు. ఐఏఎస్‌లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం పిటిషన్‌ను విచారించనుంది. అయితే.. రిపోర్టు చేసేందుకు ఈరోజే చివరి రోజు కావటంతో.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. స్టే విధిస్తుందా.. లేదా రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశిస్తుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos