ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి ఎదురనేది కనిపించడం లేదు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఊహించనంత మెజార్టీ సాధించారు. ఎవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం   విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై  రాజశేఖరం పేరాబత్తుల గెలుపొందారు.  మొత్తంగా 77,461 ఓట్ల మెజారిటీ తో ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన విజయం సాధించారు. అదేవిధంగా కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా భారీ మెజారిటీతో విజయం  సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధి లక్ష్మణరావుపై  82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా విజయం సాధించారు. 

వైసీపీ బరిలో నిలబడలేదు కానీ టీడీపీ అభ్యర్థుల్ని ఓడించడానికి ఇతరులకు మద్దతిచ్చింది.  బహిరంగంగా పిలుపునివ్వకపోయినా ఆ పార్టీ క్యాడర్ లక్ష్మణరావు, వీర రాఘవుల కోసం పని చేశారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కూటమి తిరుగులేని విజయం సాధించడం వెనుక.. కలసి ఉంటే కలదు విజయం అన్న కాన్సెప్ట్ ఉందని అంటున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి చీలిపోయింది. రఘువర్మకు టీడీపీ, జనసేన సపోర్టు చేశాయి. కానీ బీజేపీ మాత్రం గాదె శ్రీనివాసులనాయుడుకు సపోర్టు చేసింది. ఇక్కడ బీజేపీ మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థి గెలిచారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తిరుగులేని విజయాన్ని సాధించాయి. ఏ నియోజకవర్గంలో అయినా మినిమం యాభై వేలు అన్నట్లుగా మెజార్టీలు సాధించారు. ఇప్పుడు హోరాహరీగా సాగుతాయని అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. ఏకపక్ష విజయాలు లభించడంతో ఇక కూటమి పార్టీలు అలాగే ఉంటే.. ఇతర పార్టీలకు స్పేస్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మంచిదయిందని లేకపోతే.. అత్యల్పంగా వచ్చే ఓట్లతో మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos