ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాతా సుఖీభవ పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి అర్హులైన రైతులు ఇకపై ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ కోసం రైతు సేవా కేంద్రాల (RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటన రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 45.65 లక్షల మంది అర్హులలో 44.19 లక్షల మంది రైతుల డేటాను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేసింది. ఈ ప్రక్రియలో సరైన ఆధారాలు లేకపోయిన 1.45 లక్షల మంది రైతులకే వేలిముద్ర (బయోమెట్రిక్) ఆధారంగా నమోదు అవసరం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి వివరాలను ఇప్పటికే ఆయా మండలాల్లోని రైతు సేవా కేంద్రాలకు పంపించారు. ఇది వారికి కేవలం ఒకే ఒక్కసారి చేయాల్సిన ప్రక్రియగా ఉంటుంది. అవసరమైన ఆధారాలు అందించిన తర్వాత ఈ రైతుల వివరాలు కూడా ప్రభుత్వం డేటాబేసులో నమోదు చేయనుంది. ఈ నెల 20వ తేదీకి ముందే ఈ ప్రక్రియను పూర్తిచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులకు అసౌకర్యాలు లేకుండా, వ్యవస్థను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అన్నదాతా సుఖీభవ వంటి పథకాలు నేరుగా రైతుల బాగోగులే లక్ష్యంగా ఉండటంతో, ప్రభుత్వం వీటిని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos