ఏపీ ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణరాజు ఇలాకాలో నిత్యం వివాదాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. సొంత పార్టీ నేతలే రఘురామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ఘటన మరవక ముందే మరొక ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. జిల్లాలోని ఆకివీడులో జరిగిన ఘర్షణలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ దాడుల వెనక కుట్ర ఉందని, కుట్రకోణాన్ని ఛేదించాలని పోలీసు శాఖను ఆయన కోరారు.
ఆకువీడు లోని పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే కూటమి నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కూటమి నాయకులపై మేకులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా, మరొక వర్గం మద్దతుగా నిలుస్తోంది. రఘురామ కృష్ణరాజు మాత్రం అక్కడ ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పారు. హరిజనపేటలో రామాలయానికి తాము వ్యతిరేకమని కొందరు రఘురామ కృష్ణరాజును అడ్డుకున్నట్లు తెలిసింది. రఘురామ కృష్ణరాజును అడ్డుకున్న దెవరు? ఎందుకు ఆయనపై దాడికి ప్రయత్నించారు? దాడి చేసిన వర్గం ఆలోచన ఏంటి? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పవన్ కల్యాణ్ సూచన మేరకు ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు ఇలాకా రెగ్యులర్ గా కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారడం పార్టీలో హాట్ టాపిక్ అయింది..
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos