తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో తొక్కిసలాట సంభవించినట్లు వచ్చిన వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా తీసుకుంది. ఈ వార్తలను తోసిపుచ్చింది. దీనిపై సమగ్ర వివరణ ఇచ్చింది. అన్నదాన సత్రంలో తొక్కిసలాట చోటు చేసుకోలేదని, బాలుడి మృతికి గుండె జబ్బు కారణమని వివరించింది. ఆ బాలుడి పేరు మంజునాథ. కర్ణాటకలోని మడికెరి అతని స్వస్థలం. శ్రీవారిని దర్శించుకోవడానికి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఇటీవలే తిరుమలకు వచ్చారు. శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు. అక్కడ నాలుగో నంబర్ హాలు వద్ద గేటు తెరిచిన వెంటనే భక్తులు లోనికి వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో తోపులాట చోటు చేసుకుందని, ఈ ఘటనలో మంజునాథ కింద పడ్డాడని, ఆ వెంటనే స్పృహ కోల్పోయాడని, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడంటూ వార్తలొచ్చాయి.

ఈ వార్తలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి సమగ్ర వివరణ ఇచ్చారు. మంజునాథ మరణానికి సంబంధించిన వార్తలన్నీ అవాస్తవమని వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన మంజునాథ తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తరువాత బయటకి వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడని అన్నారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి మంజునాథను తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చారని, అనంతరం డాక్టర్ల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారని బీఆర్ నాయుడు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మంజునాథ ఇవాళ మంగళవారం మరణించాడని తెలిపారు.

వాస్తవానికి మంజునాథ దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడని బీఆర్ నాయుడు తెలిపారు. ఆరు సంవత్సరాల కిందటే గుండెకు చికిత్స చేసుకున్నాడని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కొన్ని ప్రసార మాధ్యమాలలో మంజునాథ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తోపులాట కారణంగా మరణించాడని పేర్కొనడం సరికాదని చెప్పారు. టీటీడీపై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించడం, అవాస్తవాలు ప్రచారం చేయడం, తద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు హెచ్చరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos