అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త వివాదం కలకలం రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎన్నికల టికెట్ కోసం ఎంపీ అనుచరులకు తాను డబ్బులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా ఆరోపించడం, అందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బు ఇచ్చానంటూ, ఆ మేరకు బ్యాంక్ స్టేట్ మెంట్ ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టారు. 

కాగా టికెట్ కోసం తనను రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ కొలికపూడి చేసిన ఆరోపణలపై ఎంపీ చిన్ని తీవ్రంగా స్పందించారు. "మొన్నటి వరకు నన్ను దేవుడు అన్నారు. ఇప్పుడు దెయ్యంలా ఎందుకు కనిపిస్తున్నానో కొలికపూడి సమాధానం చెప్పాలి" అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయింపునకు కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ, తాను చిన్ని అనుచరులకు డబ్బు ఇచ్చినట్లుగా పేర్కొంటూ దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తాజాగా తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టారు. ఈ నేపథ్యంలోనే తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పర్యటనకు ఎమ్మెల్యే కొలికపూడి దూరంగా ఉన్నారు. కాగా ఈ వివాదంపై టీడీపీ అధినాయకత్వం దృష్టి సారించింది. రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీనిపై పంచాయితీ చేయనున్నారు. రేపు పార్టీ కార్యాలయానికి రావాలంటూ ఎమ్మెల్యే కొలికపూడిని, ఎంపీ చిన్నిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచారు. పల్లా ఇద్దరితో చర్చించిన అనంతరం, ఈ వివాదాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos