నర్సాపురం: పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 31 ఏళ్ల క్రితం సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశానని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా చైతన్యం, ప్రజా భాగస్వామ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెంచిన పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.73,507 కోట్లను పెన్షన్ల రూపంలో పేదలకు అందించామని చెప్పారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టి మహిళా సాధికారతకు బాటలు వేశామని చంద్రబాబు అన్నారు. ఏ ఆడబిడ్డా వంట కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీపం పథకాన్ని తీసుకొచ్చామని, ఇప్పుడు దీపం-2.0 ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. గత ఏడాది లక్ష మంది డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈలుగా ఎదిగారని, ఈసారి లక్ష్యాన్ని మరింత పెంచామని తెలిపారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు స్వయం బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల్లో ఇంకా ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఉందని సీఎం పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను అమలు చేసి న్యాయం చేశామని చెప్పారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా అవకాశాలకు పంపిస్తున్నామని తెలిపారు.

బటన్‌ నొక్కడం కాదు.. ఇంటింటికీ వచ్చి పెన్షన్

బటన్ నొక్కడం కాదు.. ఇంటింటికీ వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా వెసులుబాటు కలిగించామని చెప్పారు. గ్రామంలో ఇంకా పేదలు ఉన్నారంటే ఆ గ్రామానికే అవమానమని వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీ4 ద్వారా జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు కృష్ణా జలాలు అందించామని చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవస్వామి పాదాల వరకు నీరు పారించామని చెప్పారు. నల్లమల కొండల్లో సొరంగాలు తవ్వి నీటిని తరలించడం తన జీవితంలో ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రేపు గోదావరి నీటిని ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు తరలించబోతున్నామని తెలిపారు. గోదావరి జలాలు తొలుత అనకాపల్లికి, వచ్చే ఏడాది విశాఖకు, ఆ తర్వాత వంశధార ప్రాంతానికి చేరేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నదుల అనుసంధానంతో దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.

పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్య స్థానంగా మారుస్తాం

గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని సీఎం విమర్శించారు. దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతిందన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలను సమర్థంగా నిర్వహిస్తూ తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించామని తెలిపారు. ఆక్వా రైతుకు అండగా నిలిచేందుకు విద్యుత్ యూనిట్ ను రూ.1.5 కే అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో ఇతర దేశాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులను తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజా పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టామని తెలిపారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆక్వా కల్చర్ యూనివర్సిటీ, డంప్ యార్డు , డెల్టా మోడర్నైజేషన్ వంటి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ఎన్డీఏ కూటమికి తిరుగులేదు

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు కూడా పాలనలో భాగం కావాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధికి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం అన్నారు. ఓటమి భయంతోనే ఏకగ్రీవాలను వద్దని గొడ్డలి పార్టీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయని. మున్సిపాలిటీలు, ఆయారాం- గయారాం అనే పరిస్థితి లేకుండా  కార్పోరేషన్లలో చైర్మన్, మేయర్ల ఎన్నికను ప్రత్యక్షం చేశామని అన్నారు. గొడ్డలి పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లను కూడా తగ్గించేశారని సీఎం ఆక్షేపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవటమే గొడ్డలి పార్టీ ఆలోచన అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ ఉపసభాపతి రఘురామ కృష్ణం రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విప్ బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

17-21-55-0955.jpeg

పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు పేదల సేవలో సీఎం చంద్రబాబు
2026-09-01 Time: 05:21:55

18-29-57-0857.jpg

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను  ప్రారంభించిన సీఎం చంద్రబాబు 
2026-08-31 Time: 06:29:57

13-55-37-0837.jpg

విశాఖలో ఏఐజీ(AIG) హాస్పిటల్స్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన..  రూ.2వేల కోట్ల పెట్టుబడి, వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మాణం
2026-08-31 Time: 01:55:37

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

Related Videos