గన్నవరం : విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో విలీనం చేయడమే తన లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శుక్రవారం రామవరప్పాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ వారి దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా శాకాంబరీ దేవిగా అలంకరించిన అమ్మవారిని యార్లగడ్డ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజులబజార్ లోని అమ్మవారి పుట్టిల్లు నుండి మంగళవాయిద్యాలు నడుమ ఆషాఢ మాస సారే ను సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించి స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను ఆలయ అభివృద్ధి పై ఏమి ఆశించి కమిటీని నియమించానో అందులో 90 శాతం నెరవేర్చరని చెప్పారు. పల్లకి సేవను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతి శుక్రవారం భక్తులందరికి అన్నవితరణ చేయడం జరిగిందన్నారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల పై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, అంపాపురం, నైనవరం, పాతపాడు, నున్న గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 40 నుంచి 50 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారని అన్నారు. కేవలం అర కిలోమీటరు దూరంలో కృష్ణానది నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సుమారు లక్షన్నర మంది ప్రజలు అధిక టిడిఎస్ ఉన్న నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో టిడిఎస్ స్థాయిలో 800 నుంచి 3000 వరకు నమోదవుతున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. తాగునీరు, డ్రైనేజీ, చెత్త నిర్వహణ, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం వీఎంసీలో విలీనం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రామవరప్పాడులో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండు 33 కేవీ సబ్స్టేషన్లను మంజూరు చేసిందని తెలిపారు. ఒక సబ్‌స్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, మరొకదానికి స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గన్నవరంలో చెత్త సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, డంపింగ్ యార్డు సమస్యను అధిగమించేందుకు చెత్తను జిందాల్ ప్లాంట్‌కు తరలిస్తున్నామని చెప్పారు. వీఎంసీ విలీన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మరోసారి తీసుకెళ్లనున్నట్లు యార్లగడ్డ తెలిపారు. అవసరమైతే గన్నవరం వరకు గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను విస్తరించాలని కోరుతానన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కలిసి ఈ అంశంపై చర్చిస్తానని వెల్లడించారు. అంతకు ముందు ఆలయ కమిటీ గత ఆరు నెలలుగా ప్రతి శుక్రవారం 600 నుంచి 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గొడ్డళ్ల చినరామారావు , ఆలయ కమిటీ చైర్మెన్ పట్టపు చంటి, ఆలయ ఈవో ప్రియాంక, గ్రామ పార్టీ అధ్యక్షులు నాబిగాని కొండయ్య, క్లస్టర్ ఇంచార్జ్ కొల్లా ఆనంద్, మాజీ సర్పంచ్ అద్దేపల్లి సాంబశివ నాగరాజు, బొమ్మసాని అరుణ కుమారి, కొంగన రవి, మున్నంగి సత్యనారాయణ, మేకల స్వాతి , పరుచూరి నరేష్ , సర్నాల బాలాజీ, మొక్కపాటి చైతన్య , ఉలాస శివ, కళ్లేపల్లి రామకృష్ణ రాజు, విజ్జి నాగరాజు, అడ్డగిరి రామకృష్ణ, మేకల స్వాతి, పుట్టి నాగరాజు, రత్నం నాగేశ్వరరావు, సంధ్య, గంధం గోవర్ధన రావు, కునపురెడ్డి నాని, మల్లిఖార్జున రావు ,కూటమి నాయకులు ఆలయ కమిటీ సభ్యులు , భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos