ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ముందుగా సాధారణ ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందు ప్రతిపాదించారు. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తూ పలు కీలక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశ పెట్టారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను సభ లో ప్రతిపాదిస్తూ రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పైన స్పష్టత ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 4,500 కోట్లను బడ్జెట్ లో ప్రకటించారు. గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా ను కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 14 వేలు కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ 20 వేలు అందించనుంది. జనవరిలో సంక్రాంతి వేళ ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లోనూ ఈ మేరకు ప్రతిపాదనలు చేయటంతో ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

మరోవైపు వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు ప్రతిపాదించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు, విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు కేటాయించారు.

అదేవిధంగా, పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు ప్రతిపాదించారు. ప్రకృతి వ్యవసాయం రూ.422.96 కోట్లు, డిజిటల్ వ్యవసాయం రూ.44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68 కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు, రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు, పంటల బీమాకు రూ.1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.3,469.47 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.108.4429 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ కు రూ.314.80 కోట్లు, సహకార శాఖకు రూ.308.26 కోట్ల మేర కేటాయింపులు చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos