విద్యుత్ చార్జీల విషయంలో ఏపీ ప్రజలకు గొప్ప ఉపశమనం లభించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలపై ఛార్జీల భారం పడకుండా .. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్‌ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ రిపోర్టు లో ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ డెసిషన్ తో ప్రజలకు ఉపశమనం లభించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లు - విక్రయాల మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి డిస్కంలు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కొనుగోలు వ్యయం రూ. 4.80 చొప్పున అంచనా వేశారు అధికారులు. ప్రస్తుతం రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ. 5.12 చొప్పున ఖర్చవుతోంది. 2025-26కు సంబంధించి ఈ అంచనాలను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుందని... ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయని అంటున్నారు.
ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలని.. విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ ఎదురు కాకుండా చూడాలని.. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో ఉత్పత్తిని.. డిమాండ్ మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ కాలాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ.. లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళి ఎందుకు ముందుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొత్తానికి విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం లేకుండా అధికారులు, నేతలు కసురత్తులు చేస్తుండటంపై హర్షం వ్యక్తం అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos