ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత.. ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారుల విచారణ ... అనంతరం అరెస్ట్ ..ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు.. ఆగస్ట్ ఒకటో తేదీ వరకూ మిథున్ రెడ్డికి రిమాండ్ విధింపు ఇలా పరిణామాలన్నీ వరుసగా జరిగిపోయాయి. కోర్టు రిమాండ్ విధించటంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి.

ఈ పరిణామాల నేపథ్యంలో మరో వార్త ప్రముఖంగా వినిపిస్తోంది.. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమహేంద్రవరంలో ఇల్లు అద్దెకు తీసుకున్నదనే వార్త.. తన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. గతంలోనూ ఇలా తప్పుడు కేసులు పెట్టారని.. కానీ ఏదీ నిలబడలేదన్నారు. ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకుందని సమాచారం.

రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి.. తనకు ఇంటి భోజనంతో పాటు పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు మిథున్ రెడ్డి. టిఫిన్‌తో పాటుగా మూడు పూటలా ఇంటి నుంచి భోజనం, వాటర్ బాటిల్స్, వెస్ట్రన్ కమోడ్ ఉండే ప్రత్యేక గది, టీవీ, న్యూస్ పేపర్లు, ఓ సహాయకుడు ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.. అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. దీంతో మంగళవారం విచారణకు హాజరైన రాజమండ్రి జైలు అధికారి.. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే ఇంటి నుంచి భోజనం అనుమతించాలంటే అండర్‌ టేకింగ్‌ లెటర్‌ అవసరమని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇంటి భోజనం పంపించేందుకు.. పెద్దిరెడ్డి కుటుంబం రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో ఓ విల్లాను పెద్దిరెడ్డి కుటుంబం అద్దెకు తీసుకుందని.. అక్కడి నుంచే భోజనం, ఇతర సామాగ్రి పంపించనున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గతంలో స్కిల్ స్కామ్‌లో అరెస్టైన సందర్భంలోనూ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos