వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చారు. కాగా.. మారుతున్న పరిస్థితులు.. భవిష్యత్ ఆలోచనలతో జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు.. జగన్ ఇద్దరు కుమార్తె లు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నత విద్య.. ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. కాగా, ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది.

వైఎస్సార్ బిడ్డలుగా జగన్ - షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి మరణం తరువాత అనేక రాజకీయ ఆటు పోట్లు ఎదుర్కొన్న జగన్ అయిదేళ్లు సీఎంగా పని చేసారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా.. జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు. కాగా, జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ నేతలు ఉన్నా.. పార్టీకి జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం... జగన్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్ లో చదువుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు.. సీఎం గా జగన్ ప్రమాణ స్వీకార వేళ మాత్రమే ఆ ఇద్దరూ అందరి ముందుకు వచ్చారు. జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ఫ్రాన్స్ లో ఎంబీఏ పూర్తి చేసారు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి నోస్టర్ డాం యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. సింగపూర్ లోని ప్రముఖ సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటుగా 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వ్యాపారాలను .. కుటుంబ వ్యవహారాలను భారతి పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో జగన్ కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్ కు అవసరమని.. ప్రస్తుత జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి.. పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా జగన్ తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొస్తారా... అందుకు వారు ఆసక్తిగా ఉన్నారా.. అంగీకరిస్తే.. వారి ఎంట్రీ ఎలా ఉంటుందీ... ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos