ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల పైన కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలకు రంగం సిద్దం చేస్తోంది. వచ్చే నెలలో బదిలీలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారు అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. జీవో-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై అభిప్రాయ సేకరణ చేసింది. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా ఈ నెల 20న ఖరారు చేయనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు దాదాపు ఖరారయ్యాయి.

ఆదర్శ ప్రాధమిక పాఠశాల విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఒకటి నుంచి అయిదు తరగతులకు అయిదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇక, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ జాబితా ను విడుదల చేయటంతో పాటుగా అభ్యంతరాలను స్వీకరించారు. పూర్తి స్థాయిలో సరిచేసిన తరువాత తుది జాబితాలను విడుదల చేస్తారు. మరోపక్క ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే పోస్టులను మార్పు చేస్తారు. దీనిపైన ఆర్థిక శాఖ అనుమతితో పాఠశాలల్లో పోస్టులపై వచ్చిన స్పష్టత ఆధారంగా బదిలీలు చేపడతారు. మే తొలి వారంలో బదిలీల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం విధానపరమైన ప్రక్రియ ఆన్ లైన్ లో నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది. అందులో భాగంగా ఖాళీల ఆధారంగా ఎంపికలను నమోదు చేసుకోవాలి. ఒక టీచర్‌ ఎన్ని ఖాళీలకైనా ఆప్షన్స్​పెట్టు కొనే వెసులుబాటు కల్పిస్తోంది. వారి సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారు తమకు నచ్చిన వాటితోపాటు తమ పాఠశాలను కూడా ఎంపిక చేసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపడతారు. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. చివరిగా ఎస్జీటీలకు బదిలీలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత మిగిలే ఖాళీలు డీఎస్సీలో వచ్చే కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం బదిలీల ప్రక్రియను మే 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు వేగంగా కసరత్తులు చేస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos