వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్న  ప్రతిపక్షనేత హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎక్కువ శాతం ఓట్లు వస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుందని, అలా ప్రతిపక్ష హోదా కావాలంటే వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు జర్మనీకి వెళ్లవచ్చని ఎద్దేవా చేశారు. జనసేనకు 21 సీట్లు రాగా, 11 సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు.

ఏపీ ప్రజలు గట్టిగా తీర్పిచ్చారు. మీ స్థాయికి తగ్గట్లుగా సభలో మమ్మల్ని ప్రశ్నించాలని సూచించారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ సభ్యులను స్పీకర్ మర్యాదపూర్వకంగా చూసినా, లోపాలు ఎత్తి చూపడం సరికాదన్నారు. అసెంబ్లీకి రాగానే గొడవ పెట్టుకోవాలి, రాద్దాంతం చేయాలనే తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు. తాను డిప్యూటీ సీఎం కనుక ప్రధాని మోదీ పక్కన కూర్చోబెట్టారు కానీ ప్రత్యేక హోదాతో కాదని అన్నారు. డిప్యూటీ సీఎంకే ప్రొటోకాల్ ఉండదు. కేవలం సీఎం చంద్రబాబుకు మాత్రమే ప్రొటోకాల్ ఉంటుంది. అందుకు మాకు కూడా ప్రొటోకాల్ కావాలని వైసీపీ నేతల తరహాలో డిప్యూటీ సీఎంగా నేను అడగటం లేదని ఎద్దేవా చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos