పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన భారత ఆర్మీ ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఆకర్షించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలూ ఉలిక్కి పడ్డాయి. భారత ఆయుధ సంపత్తి చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో స్వదేశీ సాంకేతికతో సత్తా చాటింది భారత్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పథకాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఈ ఆపరేషన్ లో తెలుగు సైంటిస్ట్ కృషి దాగి ఉంది. రాకెట్ మ్యాన్ గా పేరొందిన డీఆర్డీడీఓ మాజీ చైర్మెన్ డాక్టర్ సతీష్ రెడ్డి నాయకత్వంలోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టారన్న విషయం చాలామందికి తెలియదు.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రతిష్టాత్మక బ్రహ్మోస్.. యాంటీ డ్రోన్ మిస్సైల్ ను ప్రయోగించి విజయవంతం చేశారు డాక్టర్ సతీష్ రెడ్డి. బ్రహ్మోస్ తో పాటు డీఆర్డీఓ, ఇతర దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పాకిస్థాన్ డ్రోన్లను సమర్థవంతంగా నేల కూల్చాయి. రాకెట్‌మ్యాన్ గా గుర్తింపు పొందిన సతీష్ రెడ్డి.. భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. డీఆర్డీఓ మాజీ చైర్మన్ గా రక్షణ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
ప్రధాని మోదీ సంకల్పించిన ఆత్మనిర్భర భారత్ లో భాగంగా బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణులను రూపొందించడంలో క్రియాశీలకంగా పనిచేసిన వారిలో ఒకరు సతీష్ రెడ్డి. ఆయనది నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన అసాధారణ ప్రతిభ, దృఢ సంకల్పం, కఠోర శ్రమతో అంచలంచెలుగా ఎదిగారు. అనంతపురంలో బీటెక్, జేఎన్‌టీయూ హైదరాబాద్ లో ఎంఎస్ పూర్తి చేశారు సతీశ్‌రెడ్డి. అనంతరం 1985లో డీఆర్డీఓ లో సైంటిస్టుగా చేరారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీ రంగాల్లో విశేషమైన పరిశోధనలు చేశారు. అప్పట్లో మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో సలహాదారుగా నియమితులయ్యారు.
అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2014లో డిస్టింగ్విష్డ్ సైంటిస్టు గా, 2015లో రక్షణమంత్రికి శాస్త్రీయ సలహాదారు గా, 2018లో డీఆర్డీఓ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2020లో ఆయన పదవీకాలం మరో రెండేళ్లపాటు పొడిగించారు. సతీష్ రెడ్డి నాయకత్వంలోనే డీఆర్డీఓ స్వదేశీ సాంకేతికత అభివృద్ధి సాధించిందని, ఆత్మ నిర్భర్ భారత్ గా తిరుగులేని శక్తిగా మలచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ... సింధూర్ ఆపరేషన్ ముగిసిన అనంతరం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos