గోదావరి పుష్కరాల ముహూర్తం ఫైనల్ అయింది. అనేక చర్చల తరువాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రం నిధులను మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పనుల నిర్వహణ కోసం కమిటీ ప్రకటించింది.  2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు ఈ పుష్కరాలను నిర్వహించాలని సర్కారు లాంచనంగా నిర్ణయించింది. 

దేవాదాయ శాఖ ఇటీవల సమీక్ష జరిపి .. ఏయే తేదీల్లో పుష్కరాలు నిర్వహించాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులు, తితిదే ఆస్థాన సిద్ధాంతితో కలిపి మొత్తం 16 మంది పాల్గొని పుష్కరాల తేదీలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్కరాలను 2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించాలని ఆగమ, వైదిక పండితులు సమీక్షలో సూచించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇక ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది.  మరోవైపు అటు కేంద్రం.. రైల్వే శాఖ సైతం పుష్కరాల ఏర్పాట్లలో ముందుకు వచ్చాయి. దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75,000 మంది వరకూ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే హాజరయ్యే భక్తుల అంచనాతోపాటు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు.

రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తునందున ఈ ప్రాంతాలలో పుష్కర పనులు వేగవంతమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్య ఇస్తూ.. రద్దీ నియంత్రణ పైన ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్‌ ఏటీఎంలు, అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రతి భక్తుడు ఘాట్‌లోకి వెళ్లి పుణ్యస్నానం చేసి 15 నిమిషాల్లో బయటకొస్తారని అంచనా వేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌ నుంచి ఒక రోజులో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరికి ఇరు వైపులా 7.06 కిలోమీటర్ల మేర 97 ఘాట్‌లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తూర్పువైపు 4.93 కిలోమీటర్ల పరిధిలో 45 ఘాట్‌లను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos