గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఇవాళ మరో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసుల పాలై జైలు జీవితం అనుభవిస్తున్న ఆయనకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. అయితే దీనిపై గుర్రుగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వల్లభనేని వంశీకి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. కృష్ణాజిల్లాలో అక్రమ మైనింగ్‌ కు పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వంశీకి ఊరటనిచ్చింది. అయితే మిగతా కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వంశీ జైలు నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకుండా పోయింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు మాత్రం హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వంశీ చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా ప్రభుత్వం...  హైకోర్టు గతంలో వంశీకి ఇచ్చిన ఊరటపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనుమతి మంజూరు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేసారు. దీంతో ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీలు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos