ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలుమార్లు కేబినెట్ భేటీల్లో మంత్రులకు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. అయినా పరిస్ధితిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో రాష్ట్రంలో కేబినెట్ మంత్రులపై ఇవాళ అమరావతిలో జరిగిన హెచ్ఓడీల భేటీలో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇవాళ బుధవారం భేటీలో మంత్రుల పనితీరుపై ప్రస్తావన వచ్చింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు. చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని సీఎం తెలిపారు. అలాగే మంత్రులు కేంద్ర నిధులు తేవడంలోనూ, వినియోగంలోనూ విఫలమయ్యారని చంద్రబాబు వెల్లడించారని సమాచారం.

కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు, వాటి కోసం చేసే లాబీయింగ్ కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ఇప్పటికే పలుమార్లు ఇవే అంశాలపై చంద్రబాబు మంత్రులకు కేబినెట్ భేటీల్లో క్లాస్ లు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తమ శాఖలపై మంత్రులు పట్టు పెంచుకోవాలని గతంలో ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే మంత్రులు చంద్రబాబు వ్యాఖ్యల్ని ఇప్పటికీ పట్టించుకోవడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos