ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే కొన్ని నెలల పాటు చేరికలు ఆగిపోగా.. తాజాగా మళ్లీ పార్టీల్లో చేరికల సందడి మొదలైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరారు. ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా వైసీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ మీడియా ఛానల్‌లో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నట్లు కథనాలు వచ్చాయి.. టీడీపీవైపు చూస్తున్నారని ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. వైసీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. రాజకీయాలు వదిలేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. రేగం కుటుంబం కట్టె కాలే వరకు జగనన్నతోనే ప్రయాణం కొనసాగుతుందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ ఓ ఛానల్‌లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. అరకు నియోజకవర్గ నేతలు,కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని అన్నారు.
మీడియాలో వార్తలు రాసేముందు, నిజమని నిర్ధారణ అయ్యాకే ఆ వార్తలను ప్రచుచరించాలన్నారు. అంతేకానీ తప్పుడు కథనాలు సృష్టించడం సరికాదన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నేతల్లో, కార్యకర్తల్లో ఆభద్రత భావం కల్పించవద్దని కోరారు. తాను సాధారణ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన పార్టీని, జగనన్నను, నియోజకవర్గం ప్రజలను మోసం చేయలేనన్నారు. తన ప్రయాణం జగన్‌తోనే కొనసాగుతుందని అన్నారు. రేగం మత్స్యలింగం గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు.. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ అరకు టికెట్ ఇవ్వగా.. ఆయన ఘన విజయం సాధించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos