వైసీపీని వీడి బయటకు వెళ్లిన ఎంపీలపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెళ్లే నాయకులకు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలని సాయిరెడ్డితో కలుపుకుంటే నలుగురు పార్టీని వీడి బయటకు వెళ్లారని వారందరికి అదే వర్తిస్తుందని జగన్ అన్నారు. పార్టీ నుంచి బయటికి పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నానని రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని, క్యాడర్ కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకోవాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల గురించి వారు అలాగే చెప్పుకోవాలన్నారు. భయపడో, ఏదో కారణం చేతో మనంతట మనమే రాజీపడి అటు వైపు వెళితే వారికి గౌరవం, క్యారెక్టర్ వాల్యూ ఏముంటుందన్నారు.
కష్టం ఎల్లకాలం ఉండవని, అధికారం ఐదేళ్లు మాత్రమే ఎవరికైనా ఉంటుందని, ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుందన్నారు. సాయిరెడ్డికైనా, పార్టీని వీడి బయటకు వెళ్లిన ముగ్గురికైనా అదే వర్తిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వారించినా వినకుండా రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా పార్టీని వీడిన సాయిరెడ్డి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos