ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు కొనసాగుతోంది. లక్షలాది మంది లబ్దిదారులు కొత్త కార్డుల జారీతో పాటుగా.. పేర్ల చేర్పుల కోసం వేచి చూస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావటంతో లబ్ది దారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసారు. కాగా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ముందే కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్‌కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్.. కార్డుల జారీకి ముందు రేషన్‌కార్డుకు ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్‌ కార్డు ఈకేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. అయినా, పూర్తి స్థాయిలో లబ్ది దారులు ఈకేవైసీ పూర్తి చేయ లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈకేవైసీనీ చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆ గడువు లోపు ఈకేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

కొత్త కార్డుల జారీకి ముందే ఈకేవైసీ పూర్తి చేయటంతో పాటుగా. .బోగస్ కార్డుల ఏరివేత పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తూ.. ఆలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు ప్రకటనలు ఇచ్చారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఈకేవైసీని చేసుకునే విధానాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చారు. దీంతో, లబ్దిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మరో రెండు నెలల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల కారణంగా కార్డులో పేరున్నా.. చాలామంది విద్యార్థులు వేరే ప్రాంతాల్లో ఉంటూ చదువకోవడం వల్ల కూడా వారు ఈకేవైసీని చేసుకోలేకపోయారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈకేవైసీ చేసుకునేందుకు గడువు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా జూన్ 30 వరకు ఈకేవైసీ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos