ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల పునర్ విభజనలో భాగంగా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. ఇందులో గతంలో ఆమోదించిన రెండు జిల్లాలతో పాటు కొత్తగా మరో జిల్లా కూడా ఉంది. దీంతో ఈ జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. జిల్లాల భౌగోళిక సరిహద్దులు, పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారుస్తూ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లో విపక్ష కూటమి పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. తాము అధికారంలోకి రాగానే మరోసారి జిల్లాల పునర్ విభజన చేస్తామని ప్రకటించాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాల పునర్ విభజన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. ఈ మేరకు కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అవే మార్కాపురం, మదనపల్లె. ఆ తర్వాత పరిణామాలు మారాయి. గతంలో ఏర్పాటు చేసిన 25 జిల్లాలకు తోడు మార్కాపురం, మదనపల్లె జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం అనంతరం రంపచోడవరం కేంద్రంగా మన్యంలో మరో జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అయితే వీటితో పాటు పలు జిల్లాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాకు మారుస్తున్నారు. అలాగే రాజంపేటను కడపలో కలుపుతున్నారు. వీటితో పాటు రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని కేబినెట్ నిర్ణయించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos