కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదంటూ గత నెలలో ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించి... వెంటనే బయలుదేరి పోర్టులో నిలిపి ఉంచిన స్టెల్లా ఎల్ 1 విదేశీ నౌకలోకి వెళ్లారు. అధికారులు అడ్డుపడుతున్నా అక్కడికి వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించి.. షిప్ సీజ్ కు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేసిన అధికారులు ఇప్పుడు తాజాగా పూర్తి వివరాలు వెల్లడించారు. కాకినాడ పోర్టులో గత నెలలో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ 1 నౌకలో మొత్తం 4 వేల టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ మన్మోహన్ ప్రకటించారు. అయితే ఇందులో 1320 టన్నులు మాత్రం రేషన్ బియ్యం ఉన్నాయన్నారు. నవంబర్ 29న తమకు దొరికిన ఈ బియ్యాన్ని ల్యాబ్ కు పంపి పరిశీలన చేసి... రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని స్థానిక సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు.
కాగా ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి తెచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నదో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం కాకినాడ పోర్టులో ఎగుమతి కోసం 12 వేల టన్నుల బియ్యం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో రేషన్ బియ్యం ఉంటే సీజ్ చేస్తామని వెల్లడించారు. కొత్తగా మరిన్ని చెక్ పోస్టులు పెట్టి దేశం నుంచి ఒక్క గ్రాము రేషన్ బియ్యం కూడా ఎగుమతి కాకుండా చూస్తామని కలెక్టర్ అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos