కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన 29 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 10 దక్కాయి. ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ అవార్డుల్లో ఏపీ సత్తా చాటింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ చేతులమీదుగా ఏపీ బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవితతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. కేంద్ర వాణిజ్యశాఖ దేశవ్యాప్తంగా ఎ, బి క్యాటగిరీల్లో మొత్తం 29 అవార్డులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏకంగా పది అవార్డులు కొల్లగొట్టింది. రాష్ట్రాలకు ఎ-క్యాటగిరీలో ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణం సాధించింది. వ్యవసాయేతర ఉత్పత్తుల్లో జిల్లాలకు ప్రకటించిన అవార్డుల్లో గుంటూరు జిల్లా (మిర్చి), బాపట్ల జిల్లా (చీరాల పట్టు చీరలు-కుప్పాడం), తిరుపతి జిల్లా (వెంకటగిరి కాటన్‌ చీరలు), విజయనగరం జిల్లా (బొబ్బిలి వీణ) బంగారు పతకాలు కొల్లగొట్టగా, శ్రీకాకుళం జిల్లా (జీడిపప్పు) కాంస్యం సాధించింది. వ్యవసాయేతర ఉత్పత్తుల విభాగంలోనే శ్రీసత్యసాయి జిల్లా (ధర్మవరం పట్టుచీరలు)కు రజతం వచ్చింది. కాకినాడ జిల్లా (పెద్దాపురం సిల్క్స్‌), అనకాపల్లి జిల్లా (ఏటికొప్పాక బొమ్మలు) కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా (నరసాపురం లేస్‌ అల్లికలు) స్పెషల్ ప్రైజ్ సొంతం చేసుకొంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం, సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని నేడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందని అన్నారు. వ్యవసాయంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలు, చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తున్నామని, చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం ప్రతి నెలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోందని అన్నారు. చంద్రబాబు విజన్, ఆయన ఆలోచనలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇవ్వడంతోనే ఈ అవార్డులు సాధ్యమయ్యాయని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos