ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రానికి నేడు బాంబు బెదిరింపు కాల్ రావడం అందరినీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వివిధ వార్తాసంస్థలు నివేదించాయి. ఈ బెదిరింపు కాల్ చెన్నైలోని CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) కమాండెంట్ కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోపల తీవ్రవాదులు ఉన్నారంటూ, బాంబు పెట్టారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఆదివారం అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో షార్ కేంద్రంలో మరియు దాని చుట్టుపక్కల అడవుల్లో CISF బలగాలు, బాంబు స్క్వాడ్‌లు మరియు డాగ్ స్క్వాడ్‌లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే, అధికారులు ఈ బెదిరింపు కాల్స్ ను ఫేక్‌గా నిర్ధారించారు. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అడుగడుగునా గాలించారు. వారికి ఎక్కడా, ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఇతర బాంబు బెదిరింపు సంఘటనల నేపథ్యంలో ఆందోళన కలిగించినప్పటికీ ఎక్కడా ఏమీ లభించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల కాలంలో విజయవాడ, శంషాబాద్ విమానాశ్రయం మరియు ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చిన బెదిరింపులు భద్రతా ఆందోళనలను బాగా పెంచాయి. ప్రస్తుతం, షార్ కేంద్రంలో భద్రతను మరింత బలోపేతం చేసి, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ బృందాలు పోలీసులు షార్ పరిసర ప్రాంతాలలో తనిఖీలు కొనసాగిస్తూ సముద్ర మార్గాల లోనూ తీరప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. నాయుడుపేట డీఎస్పి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలలో పాల్గొన్నారు. తనిఖీల అనంతరం బెదిరింపు ఫోన్ కాల్ ఆకతాయిలు చేసిన పనిగా భద్రతా బలగాలు తేల్చాయి. కాగా బాంబు బెదిరింపు నేపథ్యంలో సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos