ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో  మాట్లాడేందుకు అవకాశం దొరక్క, అధికార పార్టీ సభ్యుల హేళనలు, చీత్కారాల నడుమ  కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే అడుగుపెడతానంటూ మూడేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు శపథం చేశారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో కలత చెందిన బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఏపీ అసెంబ్లీలో సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, నాటి స్పీకర్ తమ్మినేని సీతారామ్ చంద్రబాబు మైక్‌ పదేపదే కట్ చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల హేళనల నడుమ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 2021 నవంబర్‌ 19న సభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో.. టీడీపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని.. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో నిరసన తెలుపుతున్న టీడీపీ సభ్యులను తమ స్థానాల్లో కూర్చోబెట్టి సంయమనం పాటించాలని స్పీకర్ ఆదేశించినా గందరగోళం కొనసాగడంతో మొదట 11:25 గంటలకు టీ విరామం కోసం సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12:13 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే, వ్యవసాయ శాఖ మంత్రి తాను హెరిటేజ్‌కు సంబంధించిన ఏదైనా అంశంపై మాట్లాడితే చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెబుతారని అనడంపై ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పట్టుబట్టడంతో చంద్రబాబు మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇచ్చారు.

అధికార వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న అభ్యంతరకర వైఖరిని తాను ఎప్పుడూ చూడలేదని, తనను పదేపదే అవమానించారని అన్నారు. "తాను ప్రతిష్ట, గౌరవం కోసం ప్రయత్నిస్తానని తన భార్య పేరును కూడా లాగారని అంటుండగా..." చంద్రబాబు మైక్ కట్ అయ్యింది. అంతకుముందు చంద్రబాబు సతీమణిని కించపరిచేలా వైసీపీ సభ్యులు వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు కలత చెందారు. దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన విమర్శలు చేయడంతో సభలో అవమానించేలా వ్యవహరిస్తున్నారని భావించారు.

ఇలాంటి పలు అంశాలపై చంద్రబాబు మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడంతో సభలో మళ్లీ అడుగు పెట్టనని సవాలు చేశారు. అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని దానిని గౌరవ సభగా మార్చిన తర్వాత అడుగుపెడతాని శపథం చేస్తూ చంద్రబాబు నిష్క్రమించారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ డ్రామాగా అభివర్ణించింది. చేసిన వ్యాఖ్యలపై ప్రకటన చేసే అవకాశం కూడా ఇవ్వలేదని .. అందుకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నానని, తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు అనడం వీడియోల్లో కనిపించింది. ఆయన వెంట అచ్చన్నాయుడు మిగిలిన సభ్యులు వెళ్లిపోయారు. వైసీపీ పతనం మొదలైందని అచ్చన్నాయుడు వ్యాఖ్యానించడం వీడియోల్లో కనిపించింది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నుంచి నిష్క్రమించిన తర్వాత చంద్రబాబు తన భార్య భువనేశ్వరిపై పరుషమైన, అవమానకరమైన మాటల దాడి చేయడాన్ని ప్రశ్నించారు. ‘‘ రెండున్నరేళ్లుగా అవమానాలు భరిస్తూ ప్రశాంతంగా ఉన్నా.. ఈ రోజు నా భార్యను కూడా టార్గెట్ చేశారు.. నా భార్య రాజకీయాల్లోకి కూడా రాలేదు.. నేనెప్పుడూ గౌరవంగా జీవించాను. ఇక భరించలేను" అని చంద్రబాబు ఆవేదన చెందారు. మొత్తానికి అసెంబ్లీలో శపథం చేసిన మూడేళ్ల తర్వాత చంద్రబాబు తిరిగి సీఎం పదవిని అధిష్టించడంతో ఆయన ఇమేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos