తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.  అర్థరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి కొందరు వ్యక్తులు తీసుకునివెళ్లినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఆయన ఓటు కీలకం కానుంది. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్‌సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు అర్థరాత్రి కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అదృశ్యం పైన మరో వాదన వినిపిస్తోంది. ఆయన రాత్రికి రాత్రి తిరుపతిలోని తన ఆస్పత్రి నుంచి మాయమయ్యారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండటంతో ఆయనను వైసీపీ నేతలు ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్సీగా ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. ఆయన కార్పొరేటర్లలాగా హ్యాండివ్వరని అనుకున్నారు. కానీ ఆయన కూటమి నేతలతో మాట్లాడుకుని ఆ క్యాంపు లోకి వెళ్లిపోయారు. దీంతో. ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నిక ఉద్రిక్త వాతావరణం మధ్య కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos