భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవలో మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, "అమిత్ షా గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేశ పాలన, జాతీయ భద్రత పట్ల మీ అంకితభావం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. మీకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను" అని తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కల్యాణ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సేవలో ఆయన ఎల్లప్పుడూ అచంచలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ.. "గౌరవనీయులైన హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవాలు, స్పష్టత, దృఢ నిబద్ధతతో పార్లమెంటులో ప్రభావవంతమైన స్వరంతో ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చే మీ సామర్థ్యం నిజమైన రాజనీతిజ్ఞుడి లక్షణమని" కొనియాడారు. "ఈ ప్రత్యేకమైన రోజున అమిత్ షా గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ధైర్యం ప్రసాదించమని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. దేశ సేవలో ఆయన ఎల్లప్పుడూ అచంచలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. జన్మదినం సందర్భంగా అమిత్ షాకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos