కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. బీజేపీ, ఆప్ లు ఢిల్లీలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి నాలుగో సారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా... ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగింది. మిగిలిన రెండు స్థానాలను జేడీయూ, ఎల్జేపీలకు బీజేపీ కేటాయించింది.

వీటితోపాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య కనిపిస్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నించడం కూడా ఆ పార్టీకి కాస్త వ్యతిరేకతగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు టికెట్ లభించిన ఏడుగురు ఆప్ అభ్యర్థులు బీజేపీలో చేరడం ఆప్ ను ఇబ్బంది పెట్టే విషయమే. మరో వైపు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు ప్రజల్లో సానుభూతిని పెంచాయని ఆప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ప్రచారం చివరి రోజున భారీగా రోడ్ షోలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ తో పాటు పలువురు నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిది ర్యాలీలు,రోడ్ షోలను నిర్వహిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లతో పాటు,పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్భజన్ సింగ్ కూడా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మనీష్ సిసోడియా బైక్ ర్యాలీ జంగ్పురాలో జరుగుతోంది. టీఎంసి నాయకుడు శత్రుఘ్న సిన్హా కూడా కిరాడిలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. 

బురారిలోని ముకుంద్‌పూర్ చౌక్‌లో ఇవాళ సాయంత్రం జరిగే ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ కోట్ల ముబారక్‌పూర్‌లో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos