టీడీపీ యువనేత, రాష్ట్ర మంత్రి లోకేష్ .. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై సమరశంఖం పూరిస్తూ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు ఈరోజుతో అంటే జనవరి 27వ తేదీతో సరిగ్గా రెండేళ్లు ముగుస్తాయి. లోకేశ్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత యువకులం పాదయాత్రను ప్రారంభించారు రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర సాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలకభూమిక పోషించింది. యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ప్రభావమెంత ఉందో అర్థమవుతోంది.
రెండేళ్ల కిందట తెలుగుదేశం మళ్లీ గెలుస్తుందా.. జగన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి వేసిన కేసుల వల నుంచి బయటపడగలరా ... పార్టీ నేతలు ప్రజల్లోకి రాలేకపోతున్నారు… వారిని ఎలా యాక్టివ్ చేస్తారనే సందేహాల మధ్య క్యాడర్ సతమతమవుతూ ఉండేది. జగన్ ఎలాంటి ఇబ్బందులు పెట్టినా టీడీపీ నాయకత్వం ధైర్యంగా.. నిబ్బరంగా ముందుకు కదిలేది. అయినా క్యాడర్,లీడర్‌కు ఎక్కడో బెరుకు. అప్పుడే నారా లోకేష్ రంగంలోకి దిగారు. యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంతే టీడీపీ క్యాడర్‌లో ఉన్న సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. ఖచ్చితంగా గెలిచేది టీడీపీనే అని వంద శాతం నమ్మకాన్ని కలిగించడంలో యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది. అలాంటి నమ్మకం కలిగించడానికి లోకేష్ పడిన శ్రమను అంచనా వేయడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విద్యాధికుడికి రాజకీయాల్లో ఉండే హక్కు లేదన్నట్లుగా.. రౌడీలు, దొంగలు , ఖూనీకోర్లు, క్విడ్ ప్రో కో స్టార్లు మాత్రమే రాజకీయంగా సూపర్ స్టార్లు అన్నట్లుగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేశారు. నారా లోకేశ్‌ను పప్పు అంటూ ప్రచారం చేశారు. ఆయన ఎక్కడైనా మాట తడబడితే చాలు కోట్లు వెచ్చించి వైరల్ చేసేవారు. రాజకీయంగా నారా లోకేశ్‌ను ఇలా టార్గెట్ చేసిన సమయంలో ..యువగళాన్ని ఎంచుకున్నారు. తన ఇమేజ్ ను మార్చుకుంటూ.. పార్టీ రాత మార్చడానికి ప్రయత్నించారు. అనుకున్న ఫలితం సాధించారు లోకేష్.
యువగళం దిగ్విజయంగా సాగుతున్న సమయంలో… రాష్ట్రంలో ప్రజల మూడ్ అంతా మారిపోయిందని అర్థం కావడంతో .. చివరి ప్రయత్నంగా చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ రెడ్డి సర్కార్. కర్నూలులో చంద్రబాబు రాజకీయ పర్యటనలో ఉండగానే అర్థరాత్రి అరెస్టు చేశారు. నారా లోకేష్ తప్పనిసరిగా పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. పాదయాత్రతో ప్రజల్లో లోకేష్ ఇమేజ్ పెరిగిపోగా.. చంద్రబాబు ను జైల్లో పెట్టిన తర్వాత జగన్ రెడ్డి నిర్వాకాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి తన సమర్థతను నిరూపించుకున్నారు. జాతీయ నేతలతో లోకేష్ కు మంచి పరిచయాలు.. అభిమానం ఏర్పడటానికి కారణం అయింది. సిక్కోలు వరకూ సాగాలనుకున్న పాదయాత్రను విశాఖలోనే ముగించినా.. అప్పటికే లక్ష్యాన్ని సాధించేశారు. వైసీపీని భూస్థాపితం చేసేశారు. జగన్ రెడ్డి అసెంబ్లీ వైపు చూడాలంటే భయపడేలా చేశారు. దానికి ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా నిలిచాయి.
నారా లోకేష్ ను ఒకప్పుడు ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు నిప్పు. ఇప్పుడు ఎంతగా భయపడుతున్నారంటే .. తమ అక్రమాలు ఎక్కడబయట పెట్టి లోపలికి పంపుతాడోనని వైసీపీలోని సగం మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కలలోనూ వారికి రెడ్ బుక్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి తదుపరి నాయకత్వాన్ని యువగళం అందించింది. పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్న నమ్మకాన్ని కలిగించింది. అందకే టీడీపీ చరిత్రలో యువగళం పాదయాత్రకు ప్రత్యేక అధ్యాయం ఉంటుందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos