ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరపున నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి మాతకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు, సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండకు చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్‌తో ట్రైల్‌రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులతో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.20 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి ఉండవల్లికి బయల్దేరనున్నారని అధికారులు పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos