డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి దిక్సూచిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్స్ వినియోగంతోపాటు.. తయారీకి ఏపీని కేంద్రంగా నిలపాలనే ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో 2030 కల్లా డ్రోన్స్ తయారీకి కేంద్రంగా భారత్ ను నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. 14 రంగాల్లో డ్రోన్స్ వినియోగానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరికంటే ముందే అందిపుచ్చుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా.. ఈ రోజు, రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా కొనసాగనుంది. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్, తయారీ, ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఒక పాలసీ తయారు చేస్తున్నారు. ఈ సమ్మిట్ లో భాగంగా 14 థీమ్స్ తో కార్యక్రమాలు, డ్రోన్ హ్యాకథాన్, 5వేలకుపైగా డ్రోన్స్ తో డ్రోన్ షో ఉంటుంది.
వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతిభద్రతలు, తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం విధాన రూపకల్పనపై అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 దృష్టి పెట్టనుంది. వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగం పెంచడం లక్ష్యంగా సదస్సు జరగనుంది. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఏపీ ప్రభుత్వం ఈ సదస్సులో రూపకల్పన చేయనుంది. డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు సాయంత్రం విజయవాడ కృష్ణా తీరంలో భారీ ప్రదర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది మాత్రం. ఇప్పటి వరకూ దేశంలో అత్యధికంగా 2వేల డ్రోన్స్ తో షో నిర్వహించగా.. ఏపీ ప్రభుత్వం అంతకు మించి డ్రోన్స్ తో మెగాషో నిర్వహించి రికార్డు సృష్టించాలని భావిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos