ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 వార్షిక బడ్జెట్ ను శుక్రవారం అంటే రేపు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తొమ్మిది నెలల ప్రభుత్వం ఈ సారి పూర్తి స్థాయి లో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ పైన చంద్రబాబు పలుమార్లు సమీక్ష చేసారు. సంక్షేమం - అభివృద్ధి కి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఆర్దిక మంత్రి పయ్యావుల సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా
.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఈ సారి బడ్జెట్ దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా 500 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. సంక్షేమం - అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటుగా అమరావతికి నిధుల కేటాయింపు కీలకంగా మారుతోంది.

ఇక, సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లికి ఏడాదికి రూ 15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం అమలు కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.10,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రకటన చేసారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు రూ 20 వేలు ఇవ్వాల్సి ఉంది.

అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధి కారులు తేల్చారు. ఒక్కో రైతుకు రూ 20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం రూ 10,717 కోట్లు అవసరమని లెక్క వేసారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహా యించటం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇందు కోసం కావాల్సిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుందని సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos