ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తవుతున్న వేళ పాలనాపరంగా మార్పులకు సిద్దం అవుతోంది. ఉగాది నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి వేదికగా పీ4 కార్యక్రమం ప్రారంభించనున్నారు. పాలనా పరంగా కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా పాలనా పరమైన సంస్కరణలతో అభివృద్ధి - సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సు ఇందుకు వేదిక కానుంది. ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే నివేదికలు సిద్ధం అయ్యాయి.

ఈ సదస్సులో ప్రధానంగా ఉగాది నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న పీ4 కార్యక్రమం పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. అదే విధంగా పేదలందరికీ ఇళ్ల పైనా స్పష్టత ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాలను మే నెల నుంచి అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అర్హతే ప్రామాణి కంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. పది నెలల కాలంలో ప్రభుత్వ పాలన.. గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పైనా సమీక్ష చేయనున్నారు. అదేవిధంగా పాలనలో కీలకమైన శాంతిభద్రతల విషయంలోనూ చంద్రబాబు మరోసారి స్పష్టత ఇవ్వనున్నారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఇప్పటికే పోలీసు అధికారులకు తేల్చి చెప్పారు. మహిళల పై అఘాయిత్యాలు, గంజాయి - డ్రగ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ సదస్సులో జిల్లాల వారీగా సమీక్ష చేస్తూనే.. కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇక, కలెక్టర్ల సదస్సు తర్వాత పాలనలో భారీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. కొన్ని శాఖలను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్దమైంది. ఈ బదిలీలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా వచ్చే నెలలో నాగబాబు మంత్రిగా కేబినెట్ లోకి వచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మంత్రివర్గంలో కొత్తగా మరెవరికీ అవకాశం ఉండదని.. నాగబాబు చేరికకు మాత్రమే పరిమితం అవుతుందని చెబుతున్నారు. అయితే, శాఖల్లో మాత్రం మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక.. పొలిటికల్ గవర్నెన్స్ అని చెబుతున్న సమయంలో ప్రజలతో మమేకం అవుతూ ప్రజా ప్రతినిధులు.. అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos