ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రేపు ఓ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీంతో రఘురామరాజు చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం నిర్వహించాలని రఘురామ నిర్ణయించారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2021 మే 14న తనపై రాజద్రోహం కేసు పెట్టారని, తనపై కేసు పెట్టి ఏం చేశారో అందరికీ తెలుసని ఆయన తెలిపారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు కాబట్టి ఇలా ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రఘురామ తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వంలో వీడియోలో మతాల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారన్న కారణంతో రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో రఘురామను అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. సీఐడీ కస్టడీలో రఘురామపై దాడి కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఆ తర్వాత జైలు నుంచి రఘురామ విడుదలయ్యారు. అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన సొంత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ ఉండేవారు. తద్వారా టీడీపీకి దగ్గరైన ఆయన.. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. అయితే తనపై రాజద్రోహం కేసు పెట్టి హింసించినా ఆ వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘురామరాజు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ కేసులో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచేందుకే ఇలా ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో ఈ వ్యవహారంపై చర్చ జరిగేలా చేయాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos