రైతులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా పీఎం కిసాన్ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్దమైంది. దీంతో, రెండు పథకాలు ఒకే సారి అమలు అవుతున్న క్రమంలో రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో జరగ నున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గత ఏడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు.
పీఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. కాగా, పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం మూడు విడతలు గా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో రూ 20 వేలు జమ కానున్నాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. కాగా.. రేపు లేదా ఈ నెల 20న పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు.. ఆ సమయంలోనే అన్నదాత సుఖీ భవ విడుదలకు సమాయత్తం అవుతున్నారు.
నిధులు ఖాతాలో జమ కావాలంటే e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటానికి https://pmkisan.gov.in/ పోర్టల్ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్‌చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు Get OTP ఆప్షన్‌పై క్లిక్‌చేస్తే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్‌చేస్తే స్క్రీన్‌పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని భావిస్తారు. దీంతో, ప్రతీ లబ్దిదారుడికి ఈ విధానం తప్పని సరి చేసారు. దీంతో.. రేపు 18వ తేదీ, లేదంటే 20న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos