నిన్న రిపబ్లిక్ డే నాడు చాలా గొప్పగా నిన్న ఉత్సవాలు, కార్యక్రమాలు జరిపేసాం అని భుజాలు ఎగరేస్తున్న ఆంధ్రా లీడర్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను మాత్రం అనాధలా వదిలేసారనే వాదన ఏపీ లోని సామాన్యుల నుండి వినిపిస్తోంది. విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి సమాజ సారధులుగా  ప్రచారం చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు అసలు ఏపీ లోనే లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోగా .. వాళ్ళు పెట్టిన విగ్రహానికి మేమెందుకు నివాళి అర్పించాలని అనుకున్నారో ఏమో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలూ కనీసం విజయవాడ విగ్రహం వైవు కన్నెత్తి చూడలేదు. చివరకు కొందరు దళిత సంఘాల నాయకులు మాత్రం రిపబ్లిక్ డే నాడు  విజయవాడ లోని అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

వైసీపీ అధినేత మాజీ సీయం జగన్ మనసులో ఏముంటుందో గానీ రిపబ్లిక్ డే లాంటి అతి ముఖ్యమైన రోజున కూడా ఆయన ఏపీలో ఉండరు. ఉండాలని రూల్ లేకపోవచ్చు గానీ పార్టీ సభ్యులు, నాయకులకు  రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో నాయకుడు తమ పార్టీ ఆఫీసు ముందు జెండా ఎగురు వేస్తుంటే చూడడం ఒక మంచి అనుభూతి. అన్నిటినీ మించి ప్రత్యర్థుల సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కాని జగన్ కు ఎవరూ చెప్పరో లేక ఆయనకు తోచదో తెలియదు గానీ ముఖ్యమైన సమయంలో కూడా ఆయన ఏపీలో ఉండటం లేదు. విజయవాడ నడిబొడ్డున అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరీ దాదాపు 400 కోట్ల రూపాయలతో నిర్మించిన 125 అడుగుల డా.అంబేద్కర్ విగ్రహాన్ని రిపబ్లిక్ డే రోజున సందర్శించి నివాళి అర్పించే తీరికే ఆయనకూ.. ఆయన పార్టీ నేతలకు లేకుండా పోయిందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే జరిపామని గర్వంగా చెప్పుకుంటున్న కూటమి  నేతలు రిపబ్లిక్ డే కి కారణమైన అంబేద్కర్ విగ్రహాన్ని చూసి నివాళి అర్పిద్దామన్న ఆలోచనే చేయకపోవడంఫై విజయవాడ నగరంలో జనాల మధ్య చర్చ గట్టిగానే నడుస్తోంది. ప్రతి ఊర్లో ఉండే మామూలు అంబేద్కర్ విగ్రహం అయితే పెద్ద నాయకులు రాలేదని ఎవరూ అనేవారు కాదేమో గానీ తెలంగాణతో పోటీ పడి మరీ విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంఫై ఇలాంటి శీతకన్ను  చూపడం ఎంతవరకూ కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం వద్దకు మేము వెళ్ళడం ఏంటా అన్న ఆలోచన చేస్తున్నారా అనే మాటలూ వినిపిస్తున్నాయి.

కీలక సమయాల్లో, ముఖ్యమైన కార్యక్రమాల సందర్భంగా  ఆయా మహా పురుషుల విగ్రహాల దగ్గరికి వెళ్లి నివాళి అర్పించే కనీస తీరిక లేకపోతే ఇక కోట్ల ఖర్చుతో ఈ స్మృతి వనాలు, భారీ విగ్రహాలు  ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ అందరిమదిలో మెదులుతున్న ప్రశ్న. మహానాయకులు, త్యాగజీవుల విగ్రహాల పట్ల కూడా రాజకీయాలు నడిపేటట్లు ఉంటే ఇలా భారీ విగ్రహాలు పెట్టడం కేవలం ఒక మెహర్బానీ ప్రహసనం లానే మిగిలిపోయే ప్రమాదం ఉందని పలువురు రాజకీయ నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షకులు విమర్శిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos