ఏపీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీ నుంచి అనేకమంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే. వారికి మంగళవారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బుధవారానికి సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు సభలో ఎలా నడుచుకోవాలో శిక్షణ ఇప్పించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
శాసనసభ భాషలో వ్యవహరించే తీరు.. సభలో జరిగే కార్యక్రమాలపై వారు అవగాహన కల్పించారు. కొశ్చన్ అవర్ అంటే ఏంటి..జీరో అవర్.. పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంటే ఏంటి, సభలో జరిగే కీలకమైన చర్చల్లో ఎలా పాల్గొనాలి...ఎలా ప్రిపేర్ అవ్వాలి...? డిమాండ్స్...అంటే ఏమిటి.. బిల్లులు పద్దులు. చట్ట సవరణ.. అంటే ఏమిటి .... శాసనసభలో సభ్యునికి ఉండే హక్కులు, జీతభత్యాలు ... ఇలా అన్ని అంశాల గురించి స్పీకర్ తోపాటు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలోని అనుభవాలను ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడం, విలువలకు కట్టుబడి ఉండడం, ప్రజా ఉపయోగ రాజకీయాలు చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని అభిలషించారు. ప్రజా సమస్యల వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులందరిలో నేనే సీనియర్. అయినా ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సభలో సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించరని... గతంలో అదే జరిగిందని చంద్రబాబు ఆన్నారు. విజన్-2047పై మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసనసభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు వారికి సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos