డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం అయితే ఇవాళ రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం అవుతుంది.  ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రమాణ స్వీకారం అనంతరం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే నాలుగేళ్లల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడతారు. ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తెలుగు కుటుంబానికి చెందినవారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. విశాఖలో నివసిస్తున్న ప్రొఫెసర్ సి. శాంతమ్మకు ఉషా చిలుకూరి మనవరాలి వరుస అవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమార్తెనే ఉషా చిలుకూరి. ఆమెకు కృష్ణాజిల్లా ఉయ్యూరులో బంధువులు ఉన్నారు. తాత చిలుకూరి రామ్మోహన్ రావు కుటుంబం ఉయ్యూరులో ఉంటోంది. చిలుకూరి రామశాస్త్రి చాలాకాలం పాటు చెన్నైలో నివసించారు. ఐఐటీ- చెన్నైలో చదువుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రొఫెసర్‌గా పని చేశారు.

అనంతరం భార్య బాలాత్రిపుర సుందరితో కలిసి అమెరికా వెళ్లిపోయారు. రామశాస్త్రి- బాలా త్రిపురసుందరి దంపతులకు 1986 జనవరి 6వ తేదీన కాలిఫోర్నియా శాన్‌డియాగోలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె చెల్లెలు శారద ఇప్పటికీ చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఉషా చిలుకూరి వృత్తిరీత్యా అడ్వొకేట్. యేల్ యూనివర్శిటీ బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్ కింద ఆమె ఎంఫిల్ చదివారు. 2014లో జేడీ వాన్స్‌ను పెళ్లాడారు. వారిది లవ్ మ్యారేజ్. రోమన్ క్యాథలిక్ అయిన జేడీ.. యేల్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు. వారికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే పిల్లలు ఉన్నారు.

నేడు జేడీ వాన్స్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో సి.శాంతమ్మ... జేడీ వాన్స్, ఉషా చిలుకూరి వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారని ప్రశంసించారు. ట్రంప్- జేడీ వాన్స్ హయాంలో అమెరికా- భారత్ పురోగమించాలని ఆకాంక్షించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos