తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై వివాదం కొనసాగుతోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. గోశాలలో ఆవులు మరణిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ ఆరోపణలతో పాటుగా గోశాల నిర్వహణ.. గత మూడు నెలల కాలంలో చనిపోయిన ఆవుల లెక్కలను టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. 2019 - 24 మధ్య కాలంలో టీటీడీ గోశాలలో అనేక అవకతవకలు జరిగాయని ..వీటి పైన విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయని ఈవో శ్యామల రావు అన్నారు.

గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని, ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఈవో శ్యామలరావు అన్నారు. 2023లో విజిలెన్స్ అధికారులను గోశాలకు అనుమతించలేదని, గోశాలలో అక్రమాలు బయటపెడతారనే భయంతో విజిలెన్స్ అధికారులను రానివ్వలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయని తెలిపారని, అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన అన్నారు. సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయని, గడిచిన మూడు నెలల్లో 43 ఆవులు చనిపోయాయని ఈవో వెల్లడించారు. దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని, మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో గోవులు తాగే నీళ్లు కూడా నాచు పట్టేసినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం గతంలో జరిగిన తప్పులన్నింటిని ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని, దళారులపై పోలీసు, విజిలెన్స్‌ విభాగం నుంచి చర్యలు తీసుకున్నామన్నారు. ఆవు నెయ్యి కల్తీ విషయం అందరికీ తెలిసిందేనని, ఏఆర్‌ డెయిరీని బ్లాక్‌లిస్టులో పెట్టామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత.. గత పది నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరిచామని ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ ఐటీ విభాగంలో ఉన్నతస్థాయి అధికారి నియామకంలో నిబంధన గాలికొదిలేశారని, జీఎం స్థాయి అధికారి నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఐటీ విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక దళారి 50 సార్లు ఆర్జిత సేవలు టికెట్ పొందారని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos