తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం, తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, ఈ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా తిరుమల కొండపైకి వచ్చే వారి కోసం మెరుగైన వసతులు, టీటీడీలో 142 మంది కాంట్రాక్టు డ్రైవర్ల క్రమబద్ధీకరణ ఫైలు ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఒంటిమిట్ట రామాలయంలో అన్నప్రసాదాల కోసం రూ.4.35 కోట్లు కేటాయించారు.
అలానే కొత్తగా 700 వేదపారాయణదారుల ఉద్యోగాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజన మందిరాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధుల విడుదల, 320 ఆలయాలకు ఉచితంగా మైక్ సెట్ల అందజేత
, దేవాదాయ శాఖ సిఫారసుతో 600 మందికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, తిరుమలలో భక్తులు వేచి ఉండేందుకు తగిన నిర్మాణాల కోసం కన్సల్టెన్సీ నియామకం, శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి కన్సల్టెన్సీల నియామకం చేపట్టాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos