యాంకర్ శివ జ్యోతి గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో టీటీడీ అందించే అన్నప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రచర్చనీయాంశం అయ్యాయి. తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి.. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉండగా భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి.. ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్ చేశారు.

కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తిరుమల భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం రాజుకోవడంతో శివ జ్యోతి వెంటనే క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో సమస్య సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ ఆమె గురించి ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఆమె ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేశారని, దీని వల్ల ఆమె భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకోలేరని సమాచారం. శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినందుకే శివ జ్యోతిపై టీటీడీ ఈ చర్య తీసుకుందని అంటున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సైతం శివజ్యోతి షేర్ చేసిన బాత్‌రూమ్ వీడియోపై వివాదం నెలకొంది. భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

'తీన్మార్' వార్తల్లో "సావిత్రక్క"గా పాపులర్ అయిన ఆమె.. న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ యాసతో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ పాపులారిటీ తోనే బిగ్‌బాస్ సీజన్ 3 లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 98 రోజులు హౌస్‌లో ఉండి మేల్ కంటస్టెంట్స్ కి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో ఆమె మరింత స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆమె పలు టీవీ షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ మంచి ప్రజాదరణ పొందారు. అంతేకాకుండా, ఆమె 'జ్యోతక్క' పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos