డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ, ఆ తరువాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. నాగబాబుకు మంత్రి పదవి పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీ పైన కసరత్తు కొనసాగు తోంది. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్నా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఈ సమయంలో డైలమా కొనసాగుతోంది. దీంతో, ఈ సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మె ల్సీ - మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భర్తీ చేయాల్సిన అయిదు స్థానాల పైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి నిమిషంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని.. రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేసినట్లు ప్రచారం సాగింది. కాగా, దీని పైన పవన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నిక ల్లోనే నాగబాబును జనసేన నుంచి బరిలోకి దింపుతున్నట్లుగా ఫైనల్ గా తేల్చారు. 

మొత్తానికి జనసేన ఎమ్మెల్సీ అభ్యర్దిగా నాగబాబు పేరును పవన్ ప్రకటించారు. నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తు లో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక, రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీ అయిన తరువాత కేబినెట్ లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. పవన్ తాజా నిర్ణయంతో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయం అయింది.

నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖాయం కావటంతో ఇక తరువాత మంత్రి అవ్వనున్నారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. నాగబాబును రాజ్య సభకు పంపుతారని.. నామినేటెడ్ పదవి ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ సమయంలో వీటికి సమాధానంగా పవన్ ఈ ప్రకటన చేసారు. నాగబాబును నామినేషన్ కు సిద్దం కావాల్సిందిగా పవన్ ఆదేశించారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు కూటమి నుంచి ఖరారు అయిన తరువాత అయిదుగురు సభ్యులు ఒకే సమయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయిదుగురు ఏక గ్రీవంగా పెద్దల సభకు ఎంపిక కానున్నారు. దీంతో.. నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా.. త్వరలోనే మంత్రి అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos