ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్ అధికారులు రిటైర్ అయ్యారు.. వీరిలో గవర్నర్ కార్యదర్శి ఎం. హరిజవహర్‌లాల్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉన్నారు. వీరిద్దరు సోమవారం పదవీ విరమణ చేశారు.. అయితే ప్రభుత్వం వారిద్దరికి అక్కడే వెంటనే పోస్టింగ్స్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు హరిజవహర్‌లాల్, సత్యనారాయణ ను మళ్లీ అవే స్థానాల్లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇద్దరు ఐఏఎస్‌లు ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎక్స్ అఫిషియో కార్యదర్శులుగా కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ హరి జవహర్‌లాల్‌కు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు సత్కరించారు. తన కార్యదర్శిగా వ్యవహరించిన హరి జవహర్‌లాల్ పదవీ విరమణ చేయడంతో.. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సత్కారం చేశారు. అయితే జవహర్‌లాల్‌ను అదే పోస్టులో కొనసాగిస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల సేవల్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రహదారులు, భవనాల శాఖలోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.నయీముల్లా పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ఈఎస్‌సీ వి రామచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 'క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ జి.వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయడంతో చీఫ్ టెక్నికల్ ఇంజినీర్ (సీటీఈ) కె శేషుకుమార్‌కు.. క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ బాధ్యతలు' అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా ఇంకా పలు నియామకాలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos