మాజీ డీజీపీ ద్వారకాతిరుమలరావుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. ఆయన ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించగా.. తాజాగా ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. అంటే ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ బస్సులు, బస్టాండ్ల అంశాలతో పాటు ఉద్యోగుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తారు. ఏపీఎస్‌ ఆర్టీసీ పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ద్వారకా తిరుమలరావు మూడేన్నరేళ్ల పాటూ ఆర్టీసీ ఎండీ అండ్ కమిషన్ పోస్ట్‌లో కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ అయ్యారు.. జనవరి 31న రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఆయన్న ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది.. ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు ఆ బాధ్యతల్లో ఉంటారని ప్రభుత్వం తెలిపింది. అయితే పీటీడీ కమిషనర్‌ బాధ్యతలపై క్లారిటీ లేకుండా పోయింది.. కార్పొరేషన్‌ పరిధిలో బస్సులు, ఆస్తులు, ఉన్నాయి. పీటీడీ పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది ఉంటారు. అదే ఆర్టీసీ ఎండీతో పాటుగా పీటీడీ కమిషనర్ పోస్టులో ఒక్కరే ఉంటే ఆపరేషన్స్‌కు, అడ్మినిస్ట్రేషన్‌ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అందుకే ద్వారకా తిరుమలరావుకు ఆ రెండు బాధ్యతల్ని అప్పగించారు. గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన అనుభవం ఉండటంతో సంస్థను లాభాల బాటలో నడిపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మాజీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఆర్టీసీలో కీలక బాధ్యతల్ని అప్పగించడంతో ఆర్టీసీకి సంబంధించిన అంశాలు, ఉద్యోగుల అంశాలపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. గతంలో అనుభవం ఉండటంతో అక్కడి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos